
కార్తిక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రేసన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ.జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. శుక్రవారం మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరై మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మ డైరెక్టర్‌గా, వాళ్ల నాన్న ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. రాధిక మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“అని అన్నారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ‘రాయవలస’ వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ “రాఖీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ దామోదర్ ప్రసాద్, శ్రీష, అనిత చౌదరి, రవివర్మ, గోపీకృష్ణ పాల్గొన్నారు.















