
లక్నో: ఐపిఎల్‌లో భాగంగా ఆర్‌సిబిపై ఎల్‌ఎస్‌జి ఘన విజయం సాధించింది. ఆర్‌సిబిపై ఎల్‌ఎస్‌జి తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్‌సిబి తొలుత బ్యాటింగ్ చేసి 203 పరుగుల లక్ష్యాన్ని ఎల్‌ఎస్‌జి ముందు ఉంచింది. ఎల్‌ఎస్‌జిలో మిచెల్ మార్ష్ సెంచరీ చేయడంతో తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రిన్ తన మొదటి ఓవర్ లో రెండో బంతిని లైన్ లెంగ్త్ వేయడంతో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ డకౌట్ కావడంతో తొమ్మిదేళ్లలో ఇదే తొలి సారి కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ చిట్కాను అతడిపై ప్రిన్స్ ప్రయోగించి సక్సెస్ అయ్యాడు. గత మ్యాచ్‌లో ఆర్‌సిబితో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో బౌలింగ్‌లో సూచనలు ఇవ్వమని ప్రిన్స్ యాదవ్ అడిగాడు. లైన్ లెంగ్త్‌లో సింగ్స్ చేస్తే వికెట్లు వస్తాయని చెప్పాడని ప్రిన్స్ చెప్పాడు. అదే చిట్కాను విరాట్ కోహ్లీపై ప్రయోగించడంతో అతడి వికెట్ దక్కిందని ప్రిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీలో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెతెల్ వికెట్‌ను ప్రిన్స్ తీశాడు. ప్రిన్స్ యాదవ్ పది మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశారు.














