TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

హైదరాబాద్ లో ఉన్న బిర్లా ప్లానిటోరియం దేశం లో నే మొట్ట మొదటి ప్లానిటోరియం గా ఖ్యాతి గడించింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ టీ రామారావు చేత 1985 లో ప్రారంభించబడింది. వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ గొప్ప ప్రదేశాన్ని పిల్లలతో సందర్శించాలనుకునే వారు మరువకూడదు.

ఈ ప్లానిటోరియం లో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు. ఈ అనుభవం అద్వితీయం మరియు అనుపమానం అయినది. ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు పర్యాటకులకి చక్కటి సంతృప్తి కరమైన అనుభవాన్ని మిగులుస్తాయి. విజ్ఞానంతో పాటు విశ్వ పర్యటన చేసినటువంటి వినోదాన్ని కూడా అందిస్తుంది ఈ ప్లానిటోరియం. బిర్లా ప్లానిటోరియం విజ్ఞానం మరియు వినోదాన్ని అందిస్తుందనడంలో అతిశయం లేదు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana