TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

చౌమహల్లా పాలస్

అసఫ్ జహిల అధికార నివాస స్థలమైన చౌమహల్లా పాలస్ హైదరాబాద్ నిజాములకి చెందినది. పెర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమోహోల్ల పాలస్ పేరు వచ్చింది. వీటి అర్ధం నాలుగు పాలస్ లు అని అర్ధం. షాహ అఫ్ ఇరాన్ పాలసు నిర్మించిన శైలి లో నే ఈ పాలస్ ని నిర్మించారు.

18 వ శతాబ్దంలో ఈ పాలసు నిర్మాణం ప్రారంభం అయింది. ఈ పాలస్ నిర్మాణం పూర్తవడానికి పది సంవత్సరాలు పట్టింది. అందువల్ల, ఈ పాలసు యొక్క నిర్మాణం మరియు ఆకృతి వివిధ రకాల శైలులతో ప్రభావితమయ్యాయి.పలు విధాల విదులకి ఈ పాలస్ ని ఉపయోగించేవారు. నిజాముల పట్టాభిషేక కార్యక్రమం, గవర్నర్ - జనరల్స్ ల ఆహ్వాన వేడుకలు వాటిలో కొన్ని.

నిజానికి, నిజాముల హయాంలో అన్ని విధాల ఉత్సవ వేడుకలని జరుపుకునేందుకు ఈ పాలస్ ని ఉపయోగించేవారు. ఇక్కడ రెండు రాజ దర్బారులు ఉన్నాయి. ఒకటి ఉత్తరపు రాజదర్బార్. రెండవది దక్షిణపు రాజ దర్బార్. ఈ రెండు దర్బారులు చుట్టూ అందమైన డిజైన్ ల గదులు ఉన్నాయి. వైభవము మరియు మనోహరము ఈ పాలసు యొక్క విశిష్టత.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana