TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

ఢొలా రి దని

రాజస్థానీ గ్రామాల సాంప్రదాయ నమూనా తో ధోలా రి ధని ని హైదరాబాద్ నగరం లోతయారుచేసారు. ప్రధాన నగరం నుండి చాలా దూరంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం దైనందిన హడావిడి నుండి దూరంగా వారాంతపు సెలవలు గడపడానికి అనువుగా ఉంటుంది. సికింద్రాబాద్ నుండి ఈ ప్రాంతం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. థీమ్ రెస్టారెంట్ గా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

మెజెస్టిక్ గేటు నుండి ఈ ప్రాంతానికి ప్రవేశించినప్పుడు రాచరిక సంబంధమైన అనుభూతి కలుగుతుంది. రాజస్థానీ కి సంబంధించిన జానపద కథలు జానపద సాహిత్యపు ప్రపంచం లోకి అడుగిడినట్టు అనిపిస్తుంది. సాయంత్రాలు, ఈ ప్రాంతం మొత్తం 2000 లాంతర్లతో ఈ ప్రాంతం వెలుగులు చిమ్ముతుంది. ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వినోద కార్యక్రమాలు ఉంటాయి.

ఒంటె మరియు గుర్రపు స్వారీలు, జానపద సంగీతం మరియు డాన్సులు, తోలుబొమ్మ ప్రదర్శనలు, రైన్ డాన్సులు మరియు బోటింగ్ వంటివి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఎన్నో తెలుగు సినిమా షూటింగ్ లు కూడా మీరు గమనించవచ్చు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana