TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

లుంబిని పార్క్


అద్భుతమైన హుస్సేన్ సాగర్ చెరువు కి పక్కన ఉన్నది లుంబిని పార్క్ , 7.5 ఎకరాలలో విస్తరించింది. 1994 లో నిర్మితమైన ఈ పార్క్ ఆ తరువాత ఎన్నో మార్పు చేర్పులకు గురవుతూ ఎప్పటికప్పుడు అన్ని వయసుల సందర్శకులకి ఆకర్షణీయంగా మారుతున్నది. లేజర్ ఆడిటోరియం, బోటింగ్ ఫెసిలిటీ, చక్కగా నిర్వహించబడే గార్డెన్స్ మరియు మ్యూజికల్ ఫౌంటైన్స్ తో ఈ గార్డెన్ అలరారుతున్నది. అందువల్ల కుటుంబసమేత విహార యాత్రలకి ఇది నెలవైంది. 2000 మంది కూర్చోగలిగే ఈ లేజర్ ఆడిటోరియం దేశం లోనే ప్రధమమైనది.

ఈ ఆడిటోరియం హైదరాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతని గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచేందుకు నిర్మితమైంది. హైదరాబాద్ నగరం యొక్క చారిత్రిక విశేషాలను తెలిపే ప్రదర్శనలు ఆంగ్ల మరియు హిందీ భాషలలో ఈ ఆడిటోరియం లో ప్రతి రోజు ప్రదర్శితమవుతాయి.

ప్రవేశ రుసుం 10 రూపాయలు వసూలు చేస్తారు. స్పీడ్ బోటింగ్ అయితే 50 రూపాయలు, మామూలు బోటింగ్ అయితే 40 రూపాయలు, లేజర్ షోకి అయితే 50 రూపాయలు వసూలు చేస్తారు.

సందర్శించు సమయం వారంలోని సోమవారం తప్ప అన్ని రోజులలో పర్యటించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. చూడటానికి పట్టే సమయం 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana