TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

రామకృష్ణ మఠ్

లోయర్ ట్యాంక్ బ్యాండ్ రోడ్డులో ఉన్న దోమలగూడ ప్రాంతంలో ఈ రామకృష్ణ మఠ్ ఉంది. 1974 లో ఈ నగరంలో ప్రారంభమయిన ఈ మఠానికి లక్షల మంది ప్రజలు విచ్చేస్తూ ఉంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక మైన ప్రదేశమే కాకుండా, వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సెలెన్స్, వివేకానంద లైబ్రరీ, గీత దర్శన, వివేకానంద యూనివర్సల్ టెంపుల్ ఇంకా మరెన్నో వివిధ విద్యా విభాగాలు కలిగిన ప్రదేశం కూడా.

రామకృష్ణా మఠం యొక్క భక్తులు మానవులకి అన్ని విధాలా సేవలు చేస్తారు. పేదలకి ఆహారం అందించడం, చదువులు చెప్పడం, పేద విద్యార్ధులకి పాఠ్య పుస్తకాలని పంచడం, స్కూళ్ళకి వెళ్ళే పేద విద్యార్ధులకి అల్పాహారం అందించడం వంటివి వారు చేసే కొన్ని సేవలు. స్వామి వివేకానందుని చే ఏర్పాటు చేసిన కొన్ని నిబంధనలైన అన్నదానం, విద్యాదానం అలాగే జ్ఞాన దానం వంటి వి నిర్వర్తించడం ఈ మఠం యొక్క ముఖ్య ఉద్దేశం.

పేద విధ్యార్ధులకి ఉచితంగా విద్యనందించడమే కాకుండా మానసికంగా అలాగే ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహకరిస్తుంది ఈ మఠం. మతం అలాగే సంసృతి తో సంబంధం లేకుండా ఎవరైనా రామకృష్ణ ఉద్యమంలో భక్తులుగా చేరవచ్చు. స్వయం సేవకులుగా నిర్వహించేందుకు ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ మఠం లో ఉన్నాయి.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana