TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

రేమండ్ టూంబ్

నిజాముల సైనికుల ప్రఖ్యాత ఫ్రెంచ్ జనరల్ అయిన మైఖల్ జోచిం మేరీ రేమండ్ సమాధి కలిగిన ప్రాంతం రేమండ్ స్ టూంబ్. ఈ సమాధి 200 సంవత్సరాల పుర్వానిది. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులచే పూలు, అగరబత్తిలచే ఈ సమాధి తరచూ సందర్శింపబడేది. నిజానికి, నిజాములచే ఈ సమాధి దగ్గర అర్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చ్ 25 వ తారీఖున డబ్బాడు పొగ చుట్టలు ఇంకా ఒక సీసాడు బీరు ఇక్కడికి పంపించేవారు.

1940 వరకు హైదరాబాద్ స్థానికులు ఈ సమాధిని ఒక చిన్న గుడిలాగే భావించేవారు. నిజాముల సైన్యంలో ధైర్య సాహసాలు కలిగిన దయ కరుణ కలిగిన ఒక మంచి సైనికుడుగా అలాగే మంచిమనిషిగా రేమండ్ గుర్తింపు పొందాడు. నిజాములు రేమండ్ ని అత్యున్నత స్థాయి ని చ్చి గౌరవించారు. మలక్పెట్ లో ఉన్న ఒక చిన్న కొండకి ముస్సా రామ్ బాగ్ గా ఇతని పేరు పెట్టారు.

దురదృష్టవశాత్తు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ రేమండ్ టూంబ్ 2001 లో భారీ వర్షపాతానికి కూలిపోయింది. ఆ తరువాత, మునుపటి వైభవాన్ని కాపాడడం కోసం ఈ సమాధి ని మరమ్మత్తు చేసి పునరుద్దరించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana