TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

షామీర్ పేట్

హైదరాబాద్ యొక్క శివారు ప్రాంతమైన షామీర్ పెట్ సికింద్రాబాద్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని - హైదరాబాద్, NALSAR యూనివర్సిటీ అఫ్ లా మరియు జీనోమ్ వాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థలతో నిండి ఉన్న ప్రదేశం ఈ షామీర్ పేట్. ప్రఖ్యాతి గాంచిన షామీర్ పెట్ చెరువు కూడా ఈ జిల్లాలోనే ఉంది.

నిజాముల చే నిర్మించబడిన మరొక మానవ నిర్మిత చెరువు ఇది. స్థానిక పర్యటనకి ఇది ఒక ముఖ్య ప్రదేశం. ఎన్నో కుటుంబాలు, స్కూళ్ళు మరియు కాలేజీ విధ్యార్ధులతో ఈ ప్రదేశం కిటకిట లాడుతుంటుంది. వారాంత విశ్రాంతికి ఇక్కడ ఎన్నో రెస్టారెంట్లు మరియు హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఒక క్లబ్బు మరియు విలాసవంతమైన రిసార్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి.

షామీర్ పెట్ లో ఉన్న జింకల పార్కు లోజింకలె కాకుండా నెమళ్ళు మొదలగు అనేక రకాల పక్షులు కూడా కనబడతాయి. ఈ పార్క్ షామీర్ పేట చెరువుకి అతి సమీపంలో ఉంది. ఎన్నో తెలుగు సినిమాలు ఈ చెరువు చుట్టూ పక్కల ప్రదేశాలలో నిర్మితమైనాయి.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana