TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Hyderabad, Telangana

శిల్పారామం

ప్రఖ్యాతి గాంచిన కళలు మరియు హస్త కళా వస్తువుల గ్రామం మాదాపూర్ లో హైటెక్ సిటీ కి దగ్గరలో ఉన్న శిల్పారామం. హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ యొక్క హస్తకళలకే కాకుండా దేశ వ్యాప్తంగా కళలకి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం. భారత దేశం యొక్క పురాతన కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో ఈ గ్రామాన్ని నిర్మించారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా సాంప్రదాయక పండుగలని ఈ శిల్పారామంలో నిర్వహిస్తారు. 1992 లో ప్రారంభమైన దేశం లో ని వివిధ సాంప్రదాయక పండుగలని చక్కగా నిర్వహించడం వలన ఈ గ్రామం జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పండుగలు వల్ల భారత దేశం యొక్క వివిధ హస్తకళాకృతుల గురించి తెలియడమే కాకుండా అంతరించిపోకుండా ప్రాచీన కళల ని సంరక్షించే అవకాశం కూడా మీకు లభిస్తుంది.

సాంప్రదాయ ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చేతితో చెక్కబడిన ఫర్నిచర్ అలాగే ఎన్నో రకాల వస్తువులని ఇక్కడ కొనుక్కోవచ్చు. కనుల విందుగా ఉండే పచ్చటి లాన్స్ లో ఈ గ్రామాన్ని నిర్మించారు.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana