🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
🛕
Hyderabad, Telangana

సికింద్రాబాద్

హైదరాబాద్ జంటనగరంగా సికింద్రాబాద్ ప్రసిద్ది. అసఫ్ జహి రాజవంశం లో హైదరాబాద్ కి మూడవ నిజాం అయిన సికందర్ జాహ్ పేరు నుండి ఈ నగరానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది. 1806 లో ఏర్పాటయిన సికింద్రాబాద్ స్వాతంత్రం వచ్చే వరకు ప్రధానంగా బ్రిటిష్ ఆర్మీ కంటోన్మెంట్ గా వ్యవహరించేది.

హైదరాబాద్ కి సికింద్రాబాద్ జంట నగరం అయినప్పట్టికి ఈ రెండు నగరాలు రెండు విభిన్న సంస్కృతులు అలాగే రెండు విభిన్న చారిత్రిక గుర్తింపు కలిగినవి. హైదరాబాద్ నవాబుల నగరమైతే, బ్రిటిష్ వారి సైనిక దళాలు ఉన్న నగరం ఈ సికింద్రాబాద్. హైదరాబాద్ యొక్క కంటోన్మెంట్ ప్రాంతంగా ఇప్పటికీ సికింద్రాబాద్ పని చేస్తోంది. సాయుధ దళాలకి సంబంధించిన మూడు విభాగాల సిబ్బంది ఇక్కడ ఎక్కువ మంది పని చేస్తున్నారు.

ఈ జంటనగారాలని విడదీసేది హుస్సేన్ సాగర్ లేక్. అయినప్పటికీ, సికింద్రాబాద్ కి ప్రత్యేకంగా వేరే మున్సిపాలిటీ లేదు, హైదరాబాద్ లో ఒక భాగంగా సికింద్రాబాద్ ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ జంటనగరాలు కలిసి భారత దేశం లో నే ఆరవ పెద్ద కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. సికింద్రాబాద్ లో ఉన్న వినాయకుడి గుడి అత్యంత ప్రాచీన మరియు ప్రఖ్యాతమైనది.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana

Advertisement
Sponsored by ATA – American Telugu Association