TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Nalgonda, Telangana

మట్టపల్లి

నల్గొండ పట్టణానికి అతి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న మట్టపల్లి ఒక చిన్న కుగ్రామం. ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఉన్నందున ఈ గ్రామం పర్యాటకులలో పేరొందింది.

ఇది మనసుకి, శరీరానికి ప్రశాంతతను అందిస్తుంది కాబట్టి ప్రతి పర్యాటకుని జాబితాలో ఈ గ్రామం ఉండాలి. దట్టమైన అడవుల మధ్యలో, పవిత్ర నది పక్కన ఉన్న ఈ గ్రామం సాటిలేని ప్రశాంతతను ఆనందాన్ని అందిస్తుంది.హిందూ కధనం ప్రకారం వేదాద్రి, వేథపురం, మంగళగిరి, వాడపల్లితో పాటు పంచ నరసింహ క్షేత్రాలలో మట్టపల్లి ఒకటి.

నాలుగు వివిధ దిక్కులకు ప్రాతినిధ్యం వహించే ఇతర ప్రదేశాలకు మట్టపల్లి కేంద్ర ప్రాంతం. మట్టపల్లి ఒకే ఒక తీర్ధ యాత్ర స్థలం, అందులో మట్టపల్లి దేవుడు ఒక్కడే దేవుడని, దీనికి సాటి వచ్చే ప్రాంతం ఏదీ లేదని, నరసింహ స్వామి కి సాటి వచ్చే దేవుడు లేడనీ చెప్తారు.”

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana