TTTTTodayTeluguGlobal Telugu. Powered from the USA
Advertisement
🛕
Nalgonda, Telangana

నంది కొండ

నంది కొండ, కృష్ణ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం నాగార్జున సాగర్ కు అతి చేరువలో ఉంది. నందికొండ గ్రామం, విజయపురి పట్టణ సముదాయం నుండి చేరదగినంత దూరంలో ఉంది. ఈ పట్టణ సముదాయం ఇక్ష్వాకు వంశస్తుల పురాతన రాజధాని.నందికొండ, నల్గొండ దగ్గరలోని ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్య స్థానం, కారణం ఈ ప్రాంతంలోని తవ్వకాలలో బయట పడిన బౌద్ధ మఠాలు, సభామందిరాలు, స్తంభాల అనే వాస్తవం వలన ఇది ఒక ముఖ్య బౌద్ధ ప్రాంతమైంది.ఇది చరిత్ర ప్రియులు, తమలో ఒక పురావస్తు శాస్త్రవేత్త దాగి ఉన్నవారు కూడా తప్పక చూడవలసిన ప్రాంతం.

బౌద్ధ మఠాలే కాక ఇక్కడ ఇక్ష్వాకులకు చెందిన కోట శిధిలాలను కూడ మనం గమనించవచ్చు. ఈ కోట ఈ ప్రాంతంపై ఈ వంశ౦ సాగించిన అధికారం, ప్రభావాలను గుర్తు చేసే ఒక మచ్చుతునక. ఆ కాలపు కొన్ని అవశేషాలు ఇక్కడి నుండి తరలించారు, ఇవి ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖకు చెందిన మ్యూజియం వారి ఆస్థి.

English content not yet available — showing Telugu original.

🛕 More in Telangana