🏠Home📋Community📅Events📍Directory🎟️Promotions
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTM
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
TTTTTodayTeluguTMGlobal Telugu. Powered from the USA
Global Telugu. Powered from the USA
📋Community📍Biz DirectoryDirectory📢Advertise
Subscribe
…
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂Immigration
  • 🏏Cricket
  • 🏠Home
  • 📰News
  • 🗺️Regional
  • 🎬Entertainment
  • 🌎NRI Hub
  • 🕉️Culture
  • 📚Knowledge Hub
  • 🛂 Immigration
  • 🏏 Cricket
🕉️ Culture›🧒 Kids›📖 ప్రియమైన వస్తువు
ప్రియమైన వస్తువు
Akbar-Birbal

ప్రియమైన వస్తువు

priyamaina vastuvu

⏱️ 75 min read

 ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన రాణిని అంత:పురం విడిచి పుట్టింటికి వెళ్ళిపొమ్మని, ఇంకెప్పూడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు.
రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది. కాని, ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు. ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలు కు కబురు పంపింది.
బీర్బల్‌ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది. బీర్బల్‌ ఆమెను ఓదార్చి, కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు. అది విన్న రాణి మనసు కొంత కుదుటపడింది.
వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరకి వెళ్ళి “ప్రభూ, మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను. ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్ళాలనుకుంటున్నాను.
” అని వినయంగా చెప్పింది. “ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు” అని జవాబిచ్చాడు అక్బరు. ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయ్యింది.
అప్పుడు బీర్బల్‌ అక్బర్‌ దగ్గరకు వెళ్ళి “ప్రభూ, రాణీగారు కోటను వదిలి వెళ్ళి పోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని, అది లేనిదే వెళ్ళలేనని అంటున్నారు.” అని చెప్పాడు.
“తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్ళిపోమని చెప్పు.”  “అలాగే జహాపనా. ఆవిషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు” సరే రమ్మని చెప్పు” అని ఆదేశించాదు అక్బరు.
రాణి సరాసరి అక్బరు ముందు నిలబడి “ప్రభూ మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్ళవచ్చని అనుమతి ఇచ్చారు. మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను.
మీకంటే ప్రియమైనది ఈ ప్రంపంచంలో నాకు ఇంకొకటి లేదు,” అంది రాణి వణికే కంఠంతో.
రాణి మాటలు వినగానే అక్బరులోని కోపం ఒక్కసారిగా చల్లారింది. రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు.
ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు. అందుకే నవ్వుతూ బీర్బల్‌ వైపు చూశాడు.

బియ్యపు గింజ

ring15_004124_tnbఒక సారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది. కోట మొత్తం వెతికినా కనిపించలేదు.అప్పుడు అక్బర్ బీర్బల్ను దర్బారుకి పిలిపించి, “బీర్బల్, నా ఉంగరం కనిపించటం లేదు. సేవకులు కోటంతా వెతికేరు, ఐన దొరకలేదు. ఎవరో దొంగలించారని నా అనుమానం. దొంగలించిన వాళ్ళు మన సభలో ఎవరో అయ్యుండాలి, ఎవరో కనిపెట్ట గలవా?” అని అడిగారు.

బీర్బల్ ఒక నిమిషం అలోచించాడు. “ఇది చాలా సులువైన పని మహారాజా! దొంగిలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపుగింజ
వుంటుంది, అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టచ్చు!” అన్నాడు. వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం
తడువుకున్నాడు. ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు.అక్బర్ చాలా ఆశ్చర్యపోయారు. “బీర్బల్, నీకెలా తెలిసింది, దొంగ గెడ్డంలో బియ్యపుగింజ వుందని?” అని అడిగారు.“మహారాజా, తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడు భయపడుతూ వుంటుంది. దొంగతనం చెయ్యనివాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే, తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు” అని బీర్బల్ వివరించాడు.ఇలా బీర్బల్ మరొక్క సారి తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ప్రదర్శించాడు.

యమునా నది

TabacAneఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.యమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.

మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.సభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.అక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు. విషయమర్ధమయ్యింది. “మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు. సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.

అక్బర్ పరీక్ష

ఒక సారి బీర్బల్కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్ళలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు.

బీర్బల్ జ్వరం వల్ల నీరimg1130608050_1_1శించి, చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు.

అక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు.

తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే యేదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.

అక్బర్ యేమి యెరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు.

కొంతా సేపు ఇలా సాగాక, అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం యేమిటని అడిగాడు.

“ఈ గదిలో యేదో మారినట్టుంది,” అని బీర్బల్ జవాబు చెప్పాడు.

“మారిందా? యేమిటి మారిందంటావు?” అని అక్బర్ అన్నారు.

“ఈ మంచం ఒక మూల యెత్తుగా వున్నట్టుంది,” అని అన్నాడు.

“జ్వరమొచ్చి నప్పుడు అలా అనిపిస్తుంది,” అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు.

“మహారాజా! నా శరీరానికి జ్వరమొచ్చింది కాని నా మెదడుకు రాలేదు!” అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు.

అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు

బ్రాహ్మనుడు

download (5)ఒక రోజు అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు. అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు.

“మహారాజా,  నేను మా కుమార్తెకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. పెళ్ళికి ఊరి జనాలందిరిని పిలిచి, భోజనం పెట్టి, మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి, ఘనంగా సాగనంపాలన్నది  నా కొరిక. దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి. సంపాదించే మార్గం చెప్పండి”, అన్నాడు.

అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు. “నిన్ను చూస్తే చాలా బీద వాడిలా ఉన్నావు, నీ తాహతకు తగ్గట్టు పెళ్ళి చేయవచ్చు కదా, ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం యేముంది?”, అని అడిగాడు.

“నాకున్నది ఒకటే బిడ్డ, ఇది నా జీవిత ఆశయం, సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా”, అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు.

అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతుకి మించి పెళ్ళి చేయడం నచ్చలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోట మధ్యలో ఒక చెరువు వుంది. “రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను”, అని షరతు పెట్టాడు.

ఇప్పడిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలపడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు. “మహారాజా! ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్ళల్లో నిలుచుంటే ప్రాణాలు పోకొట్టుకుంటాడేమో” అని అన్నాడు

దానికి బ్రాహ్మడు, “పరవాలేదు స్వామి, నేను నుంచుంటాను, నాకు వెయ్యి వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు యేమీ లేవు” అని బదులు చెప్పాడు.

రాత్రి అక్బర్ భటుల పర్యవేక్శణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా మునిగి నుంచున్నాడు.

తెల్లవారగానే అక్బర్, బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గిరకి వచ్చారు. భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు.

బీర్బల్కి చాలా అశ్చర్యం చెందింది. “వృద్ధ బ్రాహ్మడా, ఇంత చలిలో రాత్రంతా యెలా నీటిలో నిలబడ్డావు?” అని అడిగాడు.

“రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలపడ్డాను స్వామి” అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పాడు.

ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది. “అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు. మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నావు. మన షరతును నేను రద్దు చెస్తున్నాను!” అన్నాడు.

ఆశాభంగమయిన బ్రాహ్మడు యేమి చేయాలో తెలియక, అక్బర్ మహారాజుతో వాదించలేక, నిరాశతో వెళ్ళిపోయాడు.

బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది. అక్బర్కు తెలిశేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.

మరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. “మహారాజా నేను ఖిచడి చాలా బాగా చేస్తాను, మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను” అని ఆహ్వానించాడు.

అక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది. “తప్పకుండా వస్తాను” అని మాటిచ్చాడు.

సాయంత్రం అక్బర్ తన మంత్రులతో, భటులతో బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. బీర్బల్ చాల మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్ళి, అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి, అతని ముందర పళ్ళెం మంచినినీళ్ళు సర్ది, “పెరట్లో వంట చేస్తున్నాను, ఇప్పుదే ఖిచడి తీసుకుని వస్తాను”, అంటూ మాయం అయిపోయాడు.

అక్బర్ కొంత సేపు ఒపిక పట్టాడు. కాని యెంత సేపయినా బీర్బల్ మళ్ళి రాలేదు. కొంచం సేపటికి బీర్బల్ యేమి చేస్తున్నాడు, అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు.

అక్కడ బీర్బల్ ఒక చెట్టుకింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు, కాని నిప్పు మీద వంట పాత్ర యేది లేదు.

“బీర్బల్! యేమి చేస్తున్నావు! ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద!” అని అక్బర్ కోపంగా అడిగాడు.

“మహారాజా! కోపగించుకోకండి! నేను వంట చేస్తున్నాను!” అన్నాడు బీర్బల్.

” ఎక్కడ చేస్తున్నావు? వంట పాత్రలు యేవి?” అన్నారు అక్బర్.

“అదుగో మహరాజ”, అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు. చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేళాడతీసి వుంది.

అక్బర్కు అరికాలి మంట నెత్తికి యెక్కింది. అసలే ఆకలి, ఆ పయిన ఇది. “ఇంత దూరంగా కడితే దానికి మంట యెలా చేరుతుంది, ఖిచడి యెలా ఉడుకుతుంది?” అని క్రోధంగా అరిచాడు. “అదేమిటి మహారాజా, అలా అంటారు? నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా యెక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగిలింది కదా, ఈ కుండకు కూడ అలాగే తగులుతుంది,” అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు. బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరల్ను ప్రశంసించాడు. తెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. బీర్బల్ అక్బర్ని, ఆయిన మంత్రులని, భటులనీ లోపలకి తీసుకుని వెళ్ళి ఖిచడితో పాటు పంచభక్ష్య పరవాన్నాలు వడ్డించి సత్కరించాడు. మొన్నాడు అక్బర్ ఆ బ్రాహ్మడిని కోటకు పిలిచి, క్షమాపణ అడిగి, వెయ్యి బదులు రెందు వేల వరహాలు, పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలపెట్టుకున్నాడు. బ్రాహ్మడు తన కొరికమేర కు కూ
తురి పెళ్ళి ఘనంగా చేసి ఆ అమ్మయిని సంతోశంగా అత్తారింటికి పంపించాడు.

అక్బర్ సందేహం

1280x720-tFEఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.

“బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు.

బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!”

కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు.

అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది.

అక్బర్ ఈ దృశ్యం  చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు.

బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా?” అన్నాడు.

“ఒక శిశువు ప్రాణాపాయ స్థిథిలో కనిపిస్తే మీరు యెలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు” అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు.

అసలు దొంగ ఎవరు..?

unnamedఅక్బర్ బాద్ షా రాజ్యంలో ఒక

ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి, నగలు, రొక్కం తీసుకుని పారిపోయాడు.

కొన్ని రోజుల
య్యాక, ఒక సారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. యెక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి, వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు.

“దుర్మార్గుడా! దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? నా నగలు, రొక్కం తిరిగి ఇవ్వు!” అని అరవడం మొదలుపెట్టాడు.

ధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “నేను దొంగతనం చేయడం యేమిటి, వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజ భటులకు పట్టిస్తాను!” అని గొడవపడ సాగాడు.

బజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకు వెళ్ళారు.

బీర్బల్ యెదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.

బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి, “ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను” అన్నాడు.

ఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక, బీర్బల్, “ఇప్పుడు పనివాడి తల నరికేయి!” అని ఆదేశించాడు.

ఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగారుగా తన తల లోపలకు లాగేసాడు. ఇలా బయటపడిపోయాడు.

ఇలా బీర్బల్ మళ్ళీ అతని చాకుచక్యం ప్రదర్శించుకున్నాడు.

తోటలోని మొక్కలు

maxresdefaultఅక్బర్ బాద్ షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో షికారుకు ఒక నాడు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస పడడం చూసారు.

కొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి, ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.

ఇది చూసిన అక్బర్ బాద్ షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ పడ్డారు.

ఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు. నిండు గర్భవతి ఐన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది పడసాగింది. తట్టుకోలేక ఒక రోజు బీర్బల్ను సహాయం అర్థించింది. బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో యెలా చెప్పాలని సతమతమయ్యాడు. అలోచించగా ఒక ఉపాయం తట్టింది. కోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్ళు పోయవద్దని చెప్పాడు. రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి వాడిపోతూ వుండడం గమనించాడు. వెంటనే తోట మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు. తోట మాలి బీర్బల్ ఆదేశాననుసారం మొక్కలకు నీళ్ళు పోయటంలేదని చెప్పాడు. క్రొధంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. “మొక్కలు నీళ్ళు లేకపోతే యెండిపోవ?” అని కోపంతో కేకలు వేయ సాగాడు. బీర్బల్ అప్పుడు నిదానంగా, “బాద్ షా! అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు యే తోట మాలి సహాయం లేకుండా, రోజు నీళ్ళు పోయకుండ, పెరిగాయికద? అలాగే మరి మన కోట లో తోటలకి ఇంత మంది సేవకులు యెందుకు?” అన్నాడు.

వెంటనే అక్బర్కు ఙ్యానోదయమయ్యింది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణి గారికి పరిచారకులను పురమాయించాడు.

చమురు వ్యాపారి

eG1pNmRlMTI=_o_akbar-birbal-tales-in-gujarati---the-butucher-the-grain-ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాల పెద్ద గొడవ ఐపోయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.

తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.

“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు.

అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”

వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు.

బీర్బల్ యెన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప సాగారు.

ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.

ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.

ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.

బీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

సామంతరాజు

57023_akbar-and-birbal-discovery-kids-2ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు.

దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని
నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.

సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు.

రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు.

కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.

ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు.

అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు.

బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు.

తెల్లవారింది. ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ గుర్రం తీసుకో”, అన్నాడు.

అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.

అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని చూసి సంతోశంగా సెకిలించింది.

వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి నివేదించాడు.

సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి  మళ్ళి తన రాజ్యానికి బయలుదేరాడు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 Newsletter:
📋Community Hub📍Business Dir📢Advertise With Us🕉️Dharma🦁Chanakya🔮Horoscope📅Telugu Calendar🛂Immigration
News
LatestPoliticsAPTelanganaNationalInternationalBusinessTechnologyHealth
Entertainment
Ent. HubCinemaSports
NRI & Immigration
NRI HubImmigrationH1B UpdatesGreen Card
Services
Community BoardBusiness DirectoryAdvertiseLoginSubscribe
More
DharmaChanakya SutraluHoroscopeTelugu CalendarImmigration
Disclaimer: Info on TodayTelugu.net is for general informational & community use only — accuracy not guaranteed; we are not responsible for errors or decisions made from third-party content. Read full disclaimer →
© 2026 TodayTelugu™. All rights reserved.TodayTelugu™ and associated logos are trademarks of TodayTelugu.net.
PrivacyTermsDisclaimerContactAbout Us