🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
📖
Moral Tales

శుభ్రమైన కాకి

shubhramaina kaaki

⏱️ 6 min read

పద్మకు మొదటినుంచీ కాకంటే అసహ్యం. దానికితోడు ఈ మధ్యనే ఎంతో ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్‌ కప్పును కాస్తా కాకి ముక్కున కరుచుకుని వెళ్లినప్పటినుంచి దానికి కోపం కూడా తోడైంది.

ఓ రోజున వాళ్ల ఇంటిలో పెట్టిన మందు తిని ఓ ఎలుక చచ్చింది. పనిపిల్ల దాని తోకకి పురికొస కట్టి ఈడ్చుకెళ్లి పెరట్లో పారేస్తుంటే కంపరంగా చూసింది పద్మ. రెండురోజులకి అది కుళ్లి, కంపు కొట్టసాగింది. దీనికితోడు పొరుగింటి వాళ్ల కోళ్లు చెత్తకుప్పను కెలికి మెతుకులు పోసి పోయాయి. ఆ మెతుకులకి పట్టిన చీమలు ఇంటినిండా పుట్టలు పెట్టాయి. అది చూసి పద్మ వాళ్లమ్మ... 'కాకులు ఏమై పోయాయబ్బా!' అని అనుకోవడం విని 'అమ్మకు ఆ దిక్కుమాలిన కాకులతో ఏం పనో!' అని విసుక్కుంది.

ఆ రోజు స్కూల్లో టీచర్‌ పాఠం చెబుతూ, కాకులు, గద్దలు, రాబందుల వంటి ప్రాణులు చచ్చిన పక్షులు, జంతువుల కళేబరాలను తింటూ పర్యావరణ పరిశుభ్రతకు చేస్తున్న కృషి గురించి వివరిస్తుంటే నోరు వెళ్లబెట్టుకుని మరీ వింది పద్మ. అప్పుడర్థమైంది పద్మకు పొద్దున అమ్మ కాకిని ఎందుకు తల్చుకుందో!

సాయంత్రం బడినుంచి ఇంటికి వచ్చి, పెరట్లోకెళ్లి కాళ్లూ చేతులూ కడుక్కుంటుంటే కావు కావుమంటూ అంట్ల గిన్నెల దగ్గర పడిన మెతుకులను ఏరుకుతింటున్న కాకుల గుంపు కంటపడింది. బడిలో టీచర్‌ చెప్పిన పాఠం గుర్తొచ్చింది. దాంతో ఎప్పటిలా వాటిని అదిలించడానికి బదులు ఇంట్లోకెళ్లి గిన్నెలో మిగిలిన అన్నం మెతుకులను వాటి ముందు పోసింది. అంతేకాదు, వాటికోసం ఓ మగ్గులో నీళ్లు పెట్టి, అవి ఆ మెతుకులేరుకు తిని, ఆ నీళ్లు తాగుతుంటే అపురూపంగా చూసింది.

📖 More Moral Tales

Advertisement
Sponsored by ATA – American Telugu Association