ఇప్పటి వరకు పాలనపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మెయిన్‌గా పార్టీపైనా, లీడర్లపైనా దృష్టి పెట్టారు. కొందరు నేతల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి' అంటూ గట్టిగానే మాట్లాడారు. తనతో సహా ఎవరికీ మినహాయింపులు లేవంటూ కఠిన నిబంధనలు పెట్టారు. మరి పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి?