లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'నారీ శక్తి వందన్' సహా మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, తన వ్యక్తిగత జీవితంలోని జ్ఞాపకాలను రాజకీయ పాఠాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మాట్లాడారు.