ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే ముందు కేవలం ధరను లేదా డిజైన్‌ను మాత్రమే చూడటం సరికాదు. గాలిని శుభ్రం చేసే దాని సామర్థ్యం, విడుదల చేసే రసాయనాలు, అది తొలగించగలిగే కాలుష్య కారకాలను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొనే ఈ పరికరం, అసలైన ప్రయోజనాన్ని చేకూర్చాలంటే కింది అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.