టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న నటుడు రవిబాబు, 'మురారి' సినిమా తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తండ్రి చలపతిరావు నటన, కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తూనే, తను ఎందుకు ఒకే రకమైన పాత్రలను తిరస్కరిస్తున్నారో వివరించారు.