Venus-Moon Conjunction in Taurus: ఈ నెల(ఏప్రిల్) 19, 20, 21 తేదీల్లో వృషభ రాశిలో శుక్ర చంద్రుల యుతి జరుగుతోంది. ఇందులో చంద్రుడికి వృషభ రాశి ఉచ్ఛ రాశి కాగా, శుక్రుడికి స్వక్షేత్రం. సుఖ సంతోషాలకు, విలాసాలకు, శృంగార జీవితానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం, కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో విజయాలు సాధించడం, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి.