తెలంగాణలో వాహనదారులు తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను VAHAN పోర్టల్‌లో వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కొత్త నిబంధనల ప్రకారం పోర్టల్‌లో నమోదైన వివరాలకు పంపిన ఈ-చలాన్లు అధికారికంగా అందినట్టే పరిగణిస్తారు. నోటిఫికేషన్ చూడకపోయినా జరిమానా చెల్లింపు బాధ్యత వాహన యజమానిదే. దీంతో ట్రాఫిక్, ట్యాక్స్, ఫిట్‌నెస్ వంటి కీలక సమాచారం సకాలంలో అందుతుంది.