
మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేముందు వెనక ముందు ఆలోచించుకొని ముందుకు వెళ్లాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కాస్త చికాగు కలిగిస్తాయి. అదేవిధంగా సహోదరి సహోదరుల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది. సంతాన పరమైన అంశాలు చక్కగా ఉన్నాయి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ముందుకు వెళ్లాలి అనే ఆలోచన అందరికీ నచ్చుతుంది. తద్వారా ముందుకు వెళ్లగలుగుతారు. అదే విధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిరుస్థాయి వ్యాపారస్తులకు ఒక మాదిరిగా ఉంటుంది. ఏదైనా సరే కష్టపడి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆశిస్తారు. కానీ ఏలినాటి శని వలన కొన్ని కార్యక్రమాలు చేయలేక పోతారు. ఏలినాటి శని వలన ఏదైనా ఒక పని ప్రారంభం చేద్దామంటే అది వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు అవుతుంది అనుకున్న పని పది రోజులైనా కాదు. ఇలాంటివే చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కొంత కష్టపడవలసిన సమయం అని చెప్పవచ్చు. ఏదో గొప్పగా రాణించాలనే ఆలోచన ఏదైతే ఉందో అది మధ్యలోనే చిన్న చిన్న అడ్డంకులు వచ్చి నిలిచిపోతుంది. స్థిరాస్తులకు సంబంధించి నూతన గృహం కొనాలనుకుంటారు. కానీ ఆలస్యం అవుతుంది. అలాగే ఇంటి లోన్లకు సంబంధించి ఆలస్యం అవుతాయి. ఏది ఎలా జరుగుతుందో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి ఇంటిలోన్ మంజూరు అయ్యి కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. పైన చెప్పిన రెమెడీలు చేసుకోవడం వలన చివరకు సొంతింటి కల నెరవేరుతుంది. ఇంటి లోను మంజూరు అవుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అక్కడ చదువుతున్న వారి విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. కానీ ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్లాలి. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. దీనివలన మీరు మనోధైర్యం కోల్పోవద్దు. మీ ప్రయత్నం మీరు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే కష్టేఫలి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. వివాహాది శుభకార్యాలలో మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలిసిన కుటుంబం నుంచే సంబంధం రావటం అనేది సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి రోజు అరటినారవత్తులతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయటం, అలాగే ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయటం, ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి ఫలితాలు :-
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు. వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా మంచిగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అయితే బంధువులతోటి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఎదుగుదలను చూసి బంధువులలో ఈర్షద్వేషాలు మొదలవుతాయి. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా చాలావరకు అనుకూలంగానే ఉంది. మీ కష్టానికి తగ్గినా ప్రతిఫలం లభిస్తుంది అయితే ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ మార్గాలు ఎంతగా ఉన్నా ఖర్చులు అధికంగా ఉండేసరికి ఎటు తోచని పరిస్థితి వస్తుంది. అదేవిధంగా నూతన గృహం కొనుగోలు చేసే ఆలోచన ఉంటుంది. అయితే లోను తీసుకొని కట్టగలమా లేదా అని ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే చివరకు భగవత్ సంకల్పంతోటి అంతా మంచే జరుగుతుంది అనే భావన తోటి ముందుకు వెళ్ళండి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు వారి విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి . వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా వారికి ప్రభుత్వం పరంగా రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక శుభకార్యాన్ని తలపెట్టదలుచుకుంటారు. అది చేయగలమా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా చూసుకొని ముందుకు వెళ్లండి. శుభకార్యం విషయంలో వాటి ఖర్చుల విషయంలో జీవిత భాగస్వామి తోటి చర్చించుకొని ముందుకు వెళ్ళండి. ఎదుటివారు ఏమనుకుంటారు అని ఆడంబరాలకు వెళ్లి అప్పులపాలు అవ్వద్దు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజూ ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పటించడం ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. అదే విధంగా 6 ముఖాల రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిథున రాశి ఫలితాలు :-
మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా వరకు అనుకూలంగా ఉంది. లగ్నాధిపతి బలంగా ఉన్నారు. బుధుడు లాభ స్థానంలో ఉన్నాడు. కష్టేఫలి అన్నట్లుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెడితే మీరు దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పదిమందిలో మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని చేసే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే దానికోసం కొంత ధనం కూడా ఖర్చు అవుతుంది. ఏది ఖర్చైనా సరే పదిమందిలో హుందాగా ఉండాలి, ఉద్యోగం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి అనే భావన ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ కు దూరంగా ఉండటం మంచిది. మీ దగ్గర డబ్బు ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం మంచిది. లేదా భూమి కొనుగోలు చేయటం కానీ, బంగారం కొనుగోలు చేయటం కానీ మంచిది. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ కలిసి రావు. వాటికి దూరంగా ఉండటం మంచిది. అదే విధంగా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఏదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్లడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగారీత్యా వ్యాపారరీత్యా మీరు ఏదైతే అనుకున్నారో అది సాధిస్తారు. గడచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు రాత పరీక్షలో చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ చివరకు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా చిరుస్తాయి వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రాంగానే ఉంటుంది.
ఈ వారం లాభాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు ఖర్చు చేయాలి అని ఆలోచించుకోవాలి. ఖర్చుల విషయంలో మీకున్న ఆలోచన విధానాన్నిమార్చుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలలో ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటినుంచో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్య రీత్యా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే అవి సమసిపోతాయి. ఏదైనా సరే మీరు సృజనాత్మకంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు లాభపడతారు. మీ సొంత నిర్ణయాలు మీకు యోగిస్తాయి. అదేవిధంగా భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వల్ల మీ ప్రత్యర్ధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వారు మీ ద్వారా భంగపడతారు. ఏదైనా సరే ఆ దైవానుగ్రహం వల్ల మీకు అంతా మేలే జరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో హనుమాన్ వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర వత్తులతో దీపరాధన చేయండి. అదేవిధంగా ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. అదేవిధంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా అన్ని రకాలుగా బాగుండటం కోసం రుద్ర పాశుపత హోమం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటక రాశి ఫలితాలు:-
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు మినహా మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ఖర్చులే అదుపులో ఉండవు. రాబడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు అందుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయాలు సంతానానికి మంచి ఉద్యోగం లభించటం అదేవిధంగా సంతానానికి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు సానుకూల పడతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సంతానంకు సంబంధించి భార్యాభర్తల మధ్య కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మీరే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఏ పని చేసిన సరే దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్ళటం ఒక శుభ సూచకమని చెప్పవచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా అంతగా బాలేదు. మన జాతకం ఇంతేనా అనుకునే వారికి ఈ వారం నుంచి కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం దిశగా సాగుతాయి. అదేవిధంగా విద్య కోసం వెళ్లే దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది పై చదువులకు వెళ్లాలని ఆలోచన ఉంటుంది. అయితే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ కొనాలని ఆలోచన ఉంటుంది. అది ప్రస్తుతం పక్కనబెట్టి తర్వాత కొనడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా బాగున్న పేరు ప్రఖ్యాతలు బాగున్న లాభాలు ఎంత వచ్చినా ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. మొత్తంమీద ఈ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందనే చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయటం మంగళవారం నాడు సాయంత్రం పూట రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహరాశి ఫలితాలు :-
సింహ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. కుటుంబం కోసం మీరు చేసే కష్టం ఏదైతే ఉందో దాన్ని అందరూ గుర్తిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. సంతానం పరంగా సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా సంతానానికి మంచి సంబంధం కుదరటం ఒక సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం మీ చేతికి అందుతుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్, రియల్ ఎస్టేట్ రంగం వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, చిరుస్తాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్సు సెక్టర్ లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పౌల్ట్రీ రంగం వారికి కూరగాయల వ్యాపారస్తులకు అంతంత మాత్రమే ఉంటుంది. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కంటే సొంత వ్యాపారం కలిసి వస్తుంది. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలంటే ఇంట్లో వారి పేరు మీద ప్రారంభించండి. మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. శని కొంతవరకు బాగున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వెన్నుపూస నొప్పులు చర్మ సంబంధిత ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆదిత్య హృదయం పటించడం. అదేవిధంగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం, అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన.
కన్యా రాశి ఫలితాలు :-
కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా మంచి కలిసి బాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని చేర్జార్చుకోకుండా జాగ్రత్త వహించండి. ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయాలి. ఒకసారి దగ్గరి సంబంధం చేతిదాకా వచ్చి మన చుట్టాలే కదా బాగుంది కదా అని అనుకుంటాం కానీ దూరం వెళ్ళిపోతుంది. అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వివాహానికి సంబంధించి పెళ్లి చేసుకుందామనే సమయానికి ఏదో విధంగా మనస్పర్ధలు వచ్చే విడిపోవడం ఇటువంటివి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే. అయితే ఇలాంటి విషయాలు పెద్దల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. పెళ్లయిన వారు జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు. వారి పేరు మీద పెట్టే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసిబాటుతనంగా ఉంటుంది. ఒక స్థాయికి మించి ఎదగాలనే ఆలోచనతోటి ముందుకు వెళతారు. నూతన వ్యాపారం ప్రారంభించి పదిమందిలో మనకు గుర్తింపు ఉండాలి పదిమందిలో గౌరవం ఉండాలి అనే ఆలోచన తోటి ముందుకు వెళతారు. అయితే ఒక్కొక్కసారి తప్పటడుగులు అడుగులు వేయటం చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం జరుగుతుంది. జాగ్రత్త వహించండి. ఏదైనా సరే మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకున్న నిర్ణయం దృఢంగా ఉంటుంది. మీరు ఏది చేసినా సరే అది నెరవేరుతుంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు బలంగా ఉన్నారు. అయితే కొన్ని కొన్ని పనులు చేతి దాకా వచ్చి చేజారి పోతాయి. అయితే అలాంటి విషయంలో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోండి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు Crying ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా సంతానం విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే సంతానం మంచి అభివృద్ధిలో నడవడం కోసం తల్లిదండ్రులు కష్టపడిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కలిసి వస్తుంది. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. వీరి పేరు మీద చేసే వ్యాపారం ఏదైనా సరే ఈ వారం కలిసి బాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన గ్యాస్టిక్ వంటి సమస్యలు వస్తాయి. వాటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారికి తామర వత్తులతో దీపారాధన చేయటం, అదేవిధంగా ప్రతిరోజు నువ్వుల నూనె తోటి దీపారాధన చేయటం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. దీని ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. కాలభైరవరూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. మగవారు సప్తముఖి రుద్రాక్షను మెడలో వేసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులా రాశి ఫలితాలు :-
తులా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి కలిసిబాటుతనంగా ఉంటుంది. వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం, భాగస్వామి తోటి అనుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా మీకు మీరుగా చేసుకునే సొంత వ్యాపారాలు ప్రారంభించండి. తద్వారా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మానసికంగా కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. దీని ద్వారా మద్యానికి అలవాటు పడే అవకాశం కనిపిస్తుంది. ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారి కి మేలు చేసేవారు ఎవరూ ఉండరు మిమ్మల్ని వాడుకుని వదిలేసే వారే తప్ప. మీరు పది మందికి సాయం చేస్తారు కానీ మీకు ఎవరు సాయం చేయరు. ఏదైనా సరే ధనం విషయంలో ఖర్చు విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. అదే విధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం మంచి కలిసి బాటుతనంగా ఉంది. విదేశీయానం చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. స్నేహితులకు దూరంగా ఉండటం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. చదువు మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళండి. మీరు ఏదైతే సాధిద్దామని అనుకున్నారో పదిమందిలో హుందాగా ఉండాలని అనుకున్నారో అలాగే ఉండండి. దానికోసం కష్టపడండి. ఎదుటివారి కోసం సబ్జెక్టును మార్చుకునే ప్రయత్నాలు చేయవద్దు. ఒకరి కోసం కాకుండా మీకోసం మీరు చదవండి. మీరు ఎంచుకున్న రంగంలో మీరు రాణిస్తారు. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఈ వారం అనుకూలంగా ఉంది. ఆరోగ్య రీత్యా బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. కాలం కలిసి వస్తుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే కర్మానుసారేనా జాతక ప్రభావం 50% ఉంటే మిగతా 50% మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కైబ్లు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేయండి దగ్గరి బంధువుల నుండే మంచి సంబంధం వస్తుంది. అదే విధంగా వివాహం కాని వారికి బృహు పశుపత హోమం చేసుకోవడం చెప్పదగిన సూచన. దీని ద్వారా వివాహపరంగా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయి మంచి సంబంధం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగాల వారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరుస్థాయి వ్యాపారస్తులకు కాస్మోటిక్ బ్యూటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం వల్ల ప్రతిరోజు దుర్గా స్తోత్రం పటించండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి ఫలితాలు:-
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగులపరంగా కొంతవరకు సానుకూలంగానే ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఒక్కొక్కసారి మనల్ని కించపరిచే వారిని మనల్ని ఇబ్బంది పెట్టే వారిని దాటి వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. వీళ్లను దాటి ఎదగాలి మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఇటు కుటుంబ సభ్యులలోను మనకంటూ ఒక పేరు ఉండాలనే భావన తోటి ముందుకు వెళతారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్న గ్రహగతులు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల మటుకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడిన ఇంతే ఫలితమా అని అనిపిస్తుంది. అయితే పది రూపాయలు రావాల్సిన చోట రెండు రూపాయలే లాభం వస్తుంది. అటువంటి అప్పుడు మీరు ధైర్యం కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశముంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రస్తుత గ్రహగతుల కారణంగా కొంతకాలం వేచి ఉండటం మంచిది. కొంత కాలమాగి ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదే విధంగా నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది కానీ నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నం విరమించుకోవడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపోని అనుమానాల తోటి ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. లేదా వాగ్వాదానికి దిగటం ఇటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి అనే ఆలోచన తోటి ముందుకు వెళ్లాలి. మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు వారందరిని పక్కనపెట్టి మన పని మనం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలలో ఉన్నవారికి అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రెన్స్ రాసేవారికి కాలం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, గడ్డు కాలమని చెప్పవచ్చు. ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగం పోయే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దానిని నిలబెట్టుకోండి. అదేవిధంగా మెడికల్ ఏజెన్సీ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. అదే విధంగా ఉదయం సాయంత్రం నువ్వుల నూనె తోటి, అరటి నార వత్తులతోటి లేదా లక్ష్మీనారాయణ వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఆరోగ్యం పరంగా బాగుండటం కోసం అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు రాశి ఫలితాలు :-
ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే కష్టం ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఎక్కువ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ మీ మీద నమ్మకంతో బాధ్యతలను అప్పగిస్తారు. దాని వలన పని ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా చేయాలి ఏమీ చేయాలి అనే ఆలోచనతో నాలుగు రోజులు సెలవులు తీసుకుందామనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. మీ బాధ్యతలతోటి మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించ గలుగుతారు. అయితే కొన్ని కొన్ని విషయాలలో మనకెందుకులే మన పని మనం చేసుకపోదాం ఒకరితో మనకు సంబంధం లేదు మనం ఏమి మాట్లాడినా తప్పు అవుతుందని ఒక్కొక్కసారి వదిలేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ముందుకు సాగక వెనక్కి వెళ్దామా ముందుకు వెళ్దామా అనే ఆలోచనలో ఉంటారు. ఎవరైనా గృహ నిర్మాణం పనులు చేపడితే అవి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి అర్ధాష్టమ శని కాబట్టి ఇటువంటి సమయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్నే పాటించాలి. పదిమంది సలహాలు చెప్తారు కానీ మీరు తీసుకున్న నిర్ణయం వల్లనే మీరు లాభపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్లాలి. సహోదరి సహోదరుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఆరోగ్యరీత్యా అజీర్తి ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్నచిన్న సర్జరీలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అదేవిధంగా మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రస్తుతం అంతా అనుకూలంగా లేవు. ప్రయత్నాలు ప్రారంభించండి సంవత్సరం చివరి నాటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉండే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి. 10 మందిలో హుందాగా ఉండాలి మనకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. కానీ పేరు ప్రఖ్యాతలు లేకున్నా సరే మాట పడకూడదు అనే ఆలోచన తోటి ముందుకు వెళతారు. అదేవిధంగా జీవిత భాగస్వామి తోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్న విషయంలో మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. అన్ని మనకే తెలుసు మనం చేయగలం మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి విషయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. వ్యాపారంపరంగా చక్కగా ఉంది. ఉద్యోగ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. స్థిరాస్తులకు సంబంధించి నూతన గృహం కొనుగోలు చేయాలనుకుంటారు వాటి విషయంలో దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ బంగారం కొనుగోలు చేయాలనుకుంటే చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపువత్తుల తోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. దీని ద్వారా శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి ఫలితాలు :-
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ధనం అధికంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు లేవు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇల్లు గాని ఫ్లాటుగానే కొనాలని కానీ అమ్మాలని గాని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం వాటిని విరమించుకోవడం చెప్పదగిన సూచన. అమ్మటం కానీ కొనడం గానే ప్రస్తుత పరిస్థితులలో అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఆ ఆలోచనను పక్కన పెట్టాలి. అదేవిధంగా సంతాన విద్య విషయం పట్ల కొంత నిరాశ ఏర్పడుతుంది. చక్కగా చదివించాము కష్టపడి చదివించాము అయినా సరైన ఫలితాలు రాలేదని నిరాశ ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అంతా అనుకూలంగా లేదు. వచ్చిన సంబంధం చేతిదాకా వచ్చి వెళ్లిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలపరంగా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ మానసిక క్షోభ, ఒక వెలితి అనేది ఏర్పడుతుంది. ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఇంతకు మనం చేయగలమా లేదా అనే ఒక ఆలోచన కలుగుతుంది. అలాంటివి పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవహార శైలి చక్కగా ఉంది. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద గడిచిన వారమ్ కంటే ఈ వారం కొంత బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్తాయి వ్యాపారస్తులకు కొంతవరకు బాగుంటుంది. అదే విధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి గ్రహగతులు అంతగా అనుకూలంగా లేవు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు ఆస్తి విషయంలో తగాదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోర్టుపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్లాలి. మనకే అన్ని తెలుసు అని ముందుకు వెళితే కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా పర్సనల్ లోన్లకు క్రెడిట్ కార్డులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఎనిమిది మంగళవారాలు ఆకు పూజ చేయటం చెప్పదగిన సూచన. 8 వారాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభ రాశి ఫలితాలు :-
కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. రూపాయికి రెండు రూపాయల ఖర్చు ఉంటుంది. అప్పు ఇవ్వటం కానీ తీసుకోవడం గానీ చేయడం ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొంతవరకు బాగున్నప్పటికీ ఉన్న ఉద్యోగం మారాలి పై స్థాయికి వెళ్లాలి అనే ఆలోచన ప్రస్తుతం విరమించుకోవడం చెప్పదగిన సూచన. ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు గోచరిస్తాయి. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలలో ఆరోగ్య విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలలో కూడా ఎక్కువగా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. సహోదరి సహోదరుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందుకు వెళితే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం చక్కగా ఉంది. నూతన ప్రాజెక్టులు గాని నూతన గృహం కొనుగోలు గాని చక్కగా కలిసి వస్తాయి. చేసే పనిలో కష్టం తెలుస్తుంది. పదిమందిలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కాస్మాటిక్స్ రంగం వారికి, బ్యూటీషియన్స్ టెక్నికల్ సినీకళా రంగాల వారికి చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి ఫినాన్స్ రంగం వారికి కాలం అంత అనుకూలంగా లేదు. భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దుర్ వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఏదైనా సరే స్నేహితుల మాట విని ఇంట్లో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలలో సాధ్యమైనంత వరకు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దిశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఒక నూతన కార్యక్రమం ప్రారంభించాలనే యోచన చేస్తారు. అది చక్కగా ప్రారంభించండి కలిసి వస్తుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విద్యా విషయాలు ఉద్యోగ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం నువ్వుల నూనె తోటి దీపరాధన చేయటం లక్ష్మీ తామరవత్తుల తోటి జిల్లేడు వత్తులతోటి దీపారాధన ఉదయం సాయంత్రం చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు పంచముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. అదే విధంగా ఆడవారు కాలభైరవ రూపును ఇంద్రాణి రూపును మెడలో ధరించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. కుటుంబం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం అఘోర పాశుపత హోమం చేయించుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీన రాశి ఫలితాలు :-
మీన రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. సంపాదన బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వీరికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా చేతికి అందుతాయి. ప్రభుత్వం పరంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చు బెనిఫిట్స్ కావచ్చు వీరికి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారం గడచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే పదిమంది సలహాలు తీసుకున్నప్పటికీ నిర్ణయం మీదై ఉండాలి. అదేవిధంగా పర్సనల్ లోన్లకు క్రెడిట్ కార్డులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తుంది. చక్కగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి దానివల్ల చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఎప్పుడో కొన్న స్థిరాస్తి విలువ పెరగటం జరుగుతుంది. అప్పులు తీర్చాలి అని ఆలోచన చేస్తారు. ఒక క్లారిటీ తోటి ఉండాలి ఎందుకంటే మీ చేతిలో ఎంత డబ్బు ఉన్నా నిలవదు కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాలి. సాధ్యమైనంత వరకు ఖర్చులు తీర్చుకొని అప్పులు చెల్లించే మార్గాన్ని ఎంచుకోవాలి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు ఈ వారం చక్కగా ఉన్నాయి. మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి కలిసి బాటుతనంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటారు ప్రస్తుతం వాటి విషయంలో పక్కన పెట్టుకొని ఉన్న ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరంగా ఉండటం మంచిది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లాలి. మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పదిమంది చెప్పిన మాటలు వినడం ద్వారా కొంత డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రూపాయి కి 20 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంతవరకు ఖర్చులు తగ్గించుకోవటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు శని స్తోత్రం పటించడం అదేవిధంగా దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగింది. వీలైతే అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లే టప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
















