
మేషం
మేష రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగులపరంగా మీరు అనుకున్న స్థానాన్ని చేరుకోగలుగుతారు. అనాలోచితం నిర్ణయాలు పక్కనపెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మరింత లవ్వబడతారు. ఒక సంతోషకరమైన వార్త వింటారు. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. కీలక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ తామర వత్తులతో ఓం నమో నారాయణ ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. అలాగే మొగిలిపువ్వు కుంకుమ ఆరావళి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా మనం సాధించగలము అని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ధనాదాయం బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సెల్ఫోన్ వాడకం తగ్గించండి. ఎక్కువగా మొబైల్ వాడటం వలన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటించండి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి లక్ష్మీ తామర వత్తులతో ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు స్కైబ్లు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం
మిధున రాశి వారికి వారం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఏది ఏమైనాపటికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రాజకీయరంగంలో ఉన్నవారికి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలమనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం చేయండి దీని వలన నరదిష్టి తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. వాహన అనుకూలత కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఆరావళి కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదు అనే భావన కలుగుతుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పాస్పోర్ట్ వీసా అంశాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ శ్రావణమాసంలో అమ్మవారికి ఆరావళి కుంకుమతో మొగిలి పువ్వు కుంకుమతో కుంకుమార్చన చేయండి. అలాగే లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి కలసుబాటుతనంగా ఉంటుంది. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఎంతోకాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీ ప్రయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ రాశి వారు ప్రతి రోజు కూడా దుర్గా స్తోత్రాన్ని చదవండి. శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. దీపారాధనకు నువ్వుల నూనె వేసి మంచిది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మీ ప్రయత్నాలు వారం మధ్యలో ఫలించే అవకాశం ఉంది. వివాహాది శుభాకాంక్షలు ఘనంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. జాగ్రత్త వహించండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో ఓం నమో నారాయణా వత్తులు కలిపి దీపారాధన చేయండి. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. శ్రావణమాసంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా ఖారావళి కుంకుమతో కుబేర కుంకుమతో అష్టోత్తరంతో పూజ చేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 తులసివచ్చే రంగు ఎల్లో. ఇదేరా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈవారం కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మీరు ఆత్మవిశ్వాసంతో చేసే ఏ పనైనా ముందుకు సాగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో ఓం నమో నారాయణ వత్తులు కలిపి దీపారాధన చేయండి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరావళి కుంకుమ కుబేర కుంకుమతో అష్టోత్తరంతో పూజ చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయాలలో కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా రావలసినటువంటి పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి అంతంతమాత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామరవత్తులతో ఓం నమో నారాయణ వత్తులతో కలిపి దీపారాధన చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి హోటల్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండండి. మీరు తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కావున నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేయండి. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. శ్రావణమాసంలో ప్రతిరోజు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఈ శ్రావణమాసంలో అమ్మవారికి ఆరావళి కుంకుమ కుబేర కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేయండి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కొలిక్కి రావడం మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి చిన్నచిన్న ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలము అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఇది శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు నేవి బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అచ్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఫార్మా రంగంలో ఉన్నవారికి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి చిరుస్తాయి వ్యాపారస్తులకు వైద్య వృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. సినీ కళా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఋణాల నుండి బయటపడగలుగుతారు. సోదర సోదరీమణులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. శని గ్రహానికి తైలాభిషేకం చేయించండి. లక్ష్మీ తామరవత్తులతో ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చింది నాలుగు కలిసివచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గతంలో మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఈ వారం అంతగా కలిసి రావు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో లక్ష్మి తామర వత్తులతో ఓం నమో నారాయణ వత్తులు కలిపి దీపారాధన చేయండి. అలాగే ఈ శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.









