
మేషం
మేష రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవలసిన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సానుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ మిగులుతుంది. అధికమైన ఒత్తిడిని కోపాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శని అంతగా అనుకూలంగా లేడు. రావలసిన ధనం లేటుగా చేతికి అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా సాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పిల్లల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు ఉంటాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహం కాని వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మిత్రులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కాలమనుకూలంగా ఉంది. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయ ప్రయాసలతో కానీ ఏ పని కూడా పూర్తి కాదు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగానే ఉంది. మీరు అనుకోని అవకాశాలు కొన్ని చేతికి అందుతాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. సినీ కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఈ రాశి వారు మంగళవారం మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి అలాగే మిగతా రోజులలో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు మొదలు పెట్టిన పనులు ముందుకు సాగవు. ఏ పని చేసినా పదేపదే చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ప్రతి విషయంలో కూడా దీర్ఘ ఆలోచనలు చేయకుండా ఉండటం మంచిది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలమనుకూలంగా ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణా చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కాని సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో స్థాన చలనం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తున్న వారికి గడ్డుకాలం గా చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కాంట్రాక్టులు లీజులు టెండర్లు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. శనివారం రోజున నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కుటుంబ పరిస్థితులపై దృష్టి పెడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశీ యానం చేస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సంతానానికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. బుధవారం రోజున వినాయకుడికి గకారక అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువులతో మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం మన కులం గా ఉంది మీ వంతు ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ లభించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కష్టేఫలి అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యమైన విషయాలలో గోప్యత పాటించండి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా వృత్తి ఉద్యోగాలపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అఘోర పాశుపత హోమం చేయించండి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొరియర్ పరంగా స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించండి. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కాలమనుకూలంగా ఉంది. అప్పులకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఒక బుధవారం రోజున ఘనపది స్వామివారికి గకారక అష్టోత్తరంతో పూజ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఆరోగ్య విషయంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. కుదిరితే దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించండి అదేవిధంగా అఘోర పాశుపత హోమం కూడా చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం ఉంది. బంధువులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కాస్త ఆలస్యమైనప్పటికీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కెరియర్ పరంగా సిరత్వం లభిస్తుంది. గో సేవ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ముఖ్యమైన విషయాలలో అవసరం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కెరియర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం మరియు శనివారం రోజున ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.











