
అహ్మదాబాద్: ఐపిఎల్ లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఎస్ ఆర్ హెచ్ పై జిటి 82 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత గుజరాత్ 169 పరుగుల లక్ష్యాన్ని ఎస్ ఆర్ హెచ్ ముందు ఉంచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌటైంది.
మ్యాచ్ ఓటమి అనంతరం ప్యాట్ కమ్నీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ జట్టు ఓటమి నిరాశ కలిగించిందని, ఇంకా ప్లే ఆఫ్స్ సాధించడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. జిటి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఆ జట్టు గెలుపొందిందని ప్యాట్ ప్రశంసించారు. అహ్మదాబాద్ పిచ్ పై లెంగ్త్ బౌల్స్ ప్రధానమైన మూడు వికెట్లు తీయడంతో తన ఓటమి ఖాయమైందన్నారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు బౌలింగ్ లో లెంగ్త్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఐపిఎల్ లో టాప్ 4 బాట్య్స్ మెన్లు నాలుగు వందలకు పైగా పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారని కొనియాడారు. గత ఏడు మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ లు గెలిచామని ప్యాట్ తెలియజేశారు.













