
మన తెలంగాణ/హైదరాబా ద్: తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ కోరుకున్న విధంగా సంపూర్ణంగా తె లంగాణ రాష్ట్రం సిద్దించలేదని తెలంగాణ శాసనమండలి చై ర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అ న్నారు. హైదరాబాద్ నగరం లో ఉన్న ఆంద్రప్రదేశ్ నేతలు వారి రాజధాని అమరావతిలో స్థిరపడితేనే జయశంకర్ కోరుకున్న తెలంగాణ రాష్ట్రము సి ద్దించినట్లుగా బావిస్తామని ఆయన చెప్పారు. జయశంకర్ స్పూర్తితో యువత తన జీవిత లక్ష్యలను సాధించాలని గుత్తా సుఖేందర్ సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ 92 వ జయంతి సందర్భంగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన సభ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , మంత్రి అజహరుద్దీన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మా ట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సా ధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన తన జీవిత లక్ష్యంగా ఆయన పని చేసారని వివరించారు. ప్రొఫెసర్‌గా తెలంగాణ ఆవశ్యకతను విద్యార్థులకు, ప్రజలకు ఆయన అర్ధం అయ్యేలా వివరించారని అన్నారు.








