ఛండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో సివిల్ ఆస్ప్రతిలో రోగిపై స్కానింగ్ ఆపరేటర్ అత్యాచారం చేశాడు. ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 57 ఏళ్ల మహిళ గుండె సంబంధించిన వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. పానిపట్‌లోని సివిల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు సిటి స్కాన్‌తో పాటు ఎక్స్ రే తీయాలని సూచించారు. సిటి స్కాన్ రూమ్‌లోకి తీసుకెళ్లిన తరువాత సదరు మహిళపై ఆపరేటర్ అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఇంటికి వెళ్లిన తరువాత జరిగిన విషయం భర్తకు చెప్పడంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అత్యాచారం చేసిన రెండో రోజుల తరువాత సదరు మహిళ చనిపోయింది. నిందితుడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.