హెడింగ్లే: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎలిసె పేరి 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది.

సిరీస్ ఎవరిదో?

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మూడో, చివరి టెస్టుకు గురువారం తెరలేవనుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్, రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించాయి. ప్రస్తుతం ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతోంది. ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉం డడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.