
భారత దేశం అత్యంత అధునాతన అగ్నిక్షిపణి ప్రయోగాన్ని శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ క్షిపణి ఎంఐఆర్‌వి ( మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ ఎంట్రీ వెహికిల్ )సాంకేంతికతను కలిగి ఉంది. ఎంఐఆర్‌వి అంటే ఒకే క్షిపణి ద్వారా బహుళ లక్షాలను ఒకేసారి ఛేదించడం. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది.














