
ధర్మశాల: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బిసిసిఐ షాకిచ్చింది. సోమవారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఆనందంలో ఉన్న అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్-రేట్ కారణంగా ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం అక్షర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపిఎల్ 2026 సీజన్ లో స్లో ఓవర్-రేట్ సమస్యలు పదేపదే చర్చనీయాంశంగా మారాయి. ఈ సీజన్లో పలువురు కెప్టెన్లు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాలకు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నారు.
కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ నిర్దేశించిన 211 పగరుల లక్ష్య ఛేదనలో మొదట తడబడిన ఢిల్లీ.. తర్వాత పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. 19 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఢిల్లీ 216 పరుగుల చేసి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) అర్ధ శతకాలతో రాణించగా.. చివర్లలో అశుతోష్(24), మధవ్(18 నాటౌట్), అకిబ్(10 నాటౌట్) మెరుపులు మెరించడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.













