
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారం గా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, అప్పటి సంబంధిత ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిపై చర్యలు తీ సుకోవద్దని హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలవరించింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేయడం విశేషం. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణ సహజ న్యా య సూత్రాలకు విరుద్దంగా జరిగిందని, సెక్షన్ 8 కింద నోటీసులు జారీ చేయకుండా విచారణకు పి లువడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రా జెక్టులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌కున్న వి చారణ అర్హతలను సవాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మాజీగా పని చేసి న హరీశ్‌రావు, అప్పటి ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి ఎస్కె జోషి, సిఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ సం దర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీచేసిన జీఓ 6ను సమర్థించిన హైకోర్టు, అయితే కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియాకు విడుదల చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఉందని, అందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని స్పష్టం చేసింది. కానీ విచారణ జరిపిన విధానం సహజ న్యాయ సూత్రాలు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం- 1952కు విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఎవరి ప్రతిష్టకైనా భంగం కలిగేలా నివేదిక ఇస్తున్నప్పుడు సెక్షన్ 8- బి కింద నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలని, ఆ ప్రక్రియ పాటించలేదని ధర్మాసనం తేల్చింది. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఒకరిని తప్పుపడుతున్నప్పుడు, ఆ సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు కల్పించాలని, అటువంటి అవకాశం పిటిషనర్లకు ఇవ్వలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఈ తప్పిదాల కారణంగా కమిషన్ నివేదికలో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సిఎస్ ఎస్కె జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, సిఫారసులు చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఒకవేళ సిబిఐ విచారణ జరిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పిటిషనర్ల వాదన
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందర్ వాదనలు వినిపించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం సెక్షన్ 8- బి ప్రకారం, ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అంశంపై విచారిస్తే ఆ వ్యక్తికి ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలని, కమిషన్ కెసిఆర్, హరీష్‌రావుకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. కమిషన్190 మంది సాక్షులను విచారించిందని, వారిలో ఇంజనీర్లు, అధికారుల వాంగ్మూలాలు పిటిషనర్లను కుట్రపూరితంగా ఇరికించేలా ఉన్నాయనిపేర్కొన్నారు. సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో పూర్తిగా ఉల్లంఘనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. పిటిషన్‌దారులను కేవలం సాక్షులుగా పిలిచారని, కానీ తుది నివేదికలో నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండానే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులుగా తేల్చారని పేర్కొన్నారు. అలాగే నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కీలక అంశాలను బయటపెట్టిందని, ఇది తీవ్రమైన, పరువు నష్టం కలిగించే చర్య అని, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని పేర్కొన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్టా కమిషన్ వేశామంటూ మరోకరి పరువు ప్రతిష్టలు దెబ్బతీయం సరయింది కాదని కోర్టుకు వివరించారు.
ప్రభుత్వ వాదన
సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కమిషన్ తీర్మానాలు వ్యక్తిగత అభిప్రాయాలపై కాకుండా కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల సంఘం వంటి అధికారిక సంస్థల నివేదికలు, ప్రభుత్వ ఫైళ్ల ఆధారంగా ఉన్నాయని వివరించారు. నిష్పాక్షిక ప్రభుత్వ రికార్డులపై ఆధారపడినప్పుడు సెక్షన్ 8- బి, 8- సి నోటీసులు తప్పనిసరి కాదని వాదించారు. మెదట ప్రాజెక్టుల అంచనా రూ.81 వేల కోట్లుగా ఉందని, తరువాత ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరగడం అత్యంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశమని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లు విచారణలో పాల్గొని, ఫలితాలు ప్రతికూలంగా వచ్చాక సవాలు చేయడం ఆలస్యంగా వచ్చిన ఆలోచన అని ప్రశ్నించారు. కమిషన్ పిటిషనర్లకు నోటిసులు ఇచ్చే విచారించిందని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్లు కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు.














