వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి ఉద్యోగుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు. అయితే వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టిసి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు మంటలను ఆర్పివేసి శంకర్ గౌడ్‌ను రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు.