
మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప లు కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్య త్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు సూ చించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని, ఎ స్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారుల ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సి ఎం అధికారులకు సూచించారు. పేరున్న బ్రాండ్ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులకు సిఎం సూచించారు.
పరిశ్రమల శాఖకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా దావోస్లో జరిగిన పెట్టుబడులకు సంబంధించి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన ఎంఓయూలు, వాటి పురోగతి గురించి సిఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటివరకు పనులు ప్రారంభించిన కంపెనీలు, పెండింగ్ వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాల గురించి అధికారులు సిఎం తెలియచేశారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.














