
వేధింపుల కారణంగా ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. నగరంలోని మట్టెవాడ పరిధిలో నివాసం ఉంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్లో సంగీత(33) అనే మహిళ, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బందోబస్తు విధులు ముగించుకుని మంగళవారం మట్టెవాడలోని తన నివాసానికి చేరుకున్న సంగీత.. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అయితే, శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంగీత, సూసైడ్ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మట్టేవాడ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













