
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే పెద్దిలోని ఐటమ్ సాంగ్ గురించి.
ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇంకా సినిమాలో ఐటమ్ సాంగ్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పటివరకూ అందులో చరణ్‌తో కలిసి చిందులు వేసే హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకూ ప్రకటించలేదు. కొద్ది రోజుల క్రితం సంయుక్త మీనన్ ఈ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. మృణాల్ ఠాకూర్, మానస వారణాసిల పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయినే శృతి హాసన్. శృతి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.











