
రాష్ట్రంలోని పాఠశాలలకు శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. గురువారం చివరి పనిదినం కావడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. సుమారు నెలన్నర పాటు విద్యార్థులు సెలవుల్లో సరదాగా గడపనున్నారు.












