మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, రేవంత్‌రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. తీర్పు అనంతరం హరీష్‌రావు విలేకరులతో మా ట్లాడుతూ బిఆర్‌ఎస్‌పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసు లు బనాయిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు ప్రాథమిక హక్కులు,

సహ జ న్యాయసూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాం టి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సం ఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కాళేశ్వరమే ఈ రా ష్ట్రానికి ప్రాణాధారమని హరీష్‌రావు తెలిపారు. ఈ తీర్పు సత్యమేవ జయతే అని, హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచిందని హరీష్‌రావు పేర్కొన్నారు.

70 శాతం తెలంగాణకు తాగునీరు అందిస్తున్నది కాళేశ్వరమే

హైదరాబాద్‌తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్‌రావు తెలిపారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూ డు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకా శం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్‌రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయ ర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్‌రావు అన్నారు. ఎన్‌డిఎస్‌ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సం బంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు.

అవినీతి బయటపెడితే నాపై రెండు ఎంక్వైరీలు వేశారు

అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాంలను బయటపెడుతున్నామని, స మాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, తాను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే తన మీద రెండు ఎంక్వైరీలు వేశారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించ డం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.