బెంగళూరు: ఓ యువతి బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చి అనంతరం పసికందు గొంతు కోసి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం దేవనహళ్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఫాక్స్ కాన్ సంస్థలో 19 ఏళ్ల యువతి పని చేస్తోంది. సదరు యువతి గర్భం దాల్చింది. జాబ్ చేస్తుండగా యువతికి కడుపులో నొప్పి రావడంతో బాత్రూమ్ లోకి వెళ్లింది. పండింటి బిడ్డకు జన్మనివ్వడంతో పరువు పోతుందని భావించింది. వెంటనే బిడ్డను గొంతు కోసి హత్య చేసింది. అనంతరం మరొకరు వాష్ రూమ్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువతికి ఆస్పత్రిలో చికిత్స అందస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.