
అమరావతి: ఆన్ లైన్ రమ్మీ జూదం ఓ కుటంబాన్ని బలితీసుకుంది. అన్ లైన్ రమ్మీలో డబ్బులు పెట్టి ఆడడంతో అప్పుల పాలు కావడంతో తల్లి, భార్య నుంచి భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటుండగా కూతుళ్లు కాపాడాబోయి వారు కూడా మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో పుత్తూరు ప్రాంతంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం గ్రామంలో మోహన్(38), హరిత(33) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కౌశిక్(14), హరిణి(12) అనే కూతుళ్లు ఉన్నారు. మోహన్ తల్లి చంద్రకళ కూడా వారితో కలిసి ఉంటుంది. మోహన్ తండ్రికి రైల్వేలో ఉద్యొగం ఉండడంతో కారుణ్యనియమాకం కింద అతడికి ఇచ్చారు. రైల్వే ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటున్నారు. కొన్నిరోజులగా ఆన్ లైన్ లో రమ్మీకి బానిసగా మారాడు. అన్ లైన్ లో డబ్బుల పెట్టి రమ్మీ ఉండడంతో పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నాడు.
భార్య బ్యూటీ పార్లర్, టైలరింగ్ తో పాటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అన్ లైన్ రమ్మీలో డబ్బులు పొగొట్టుకోవడంతో ఎక్కువగా అప్పులు కావడంతో ఆర్థికంగా కుంగిపోయాడు. రూ.20 లక్షలు చిట్టీల డబ్బులు తీసుకొచ్చి అప్పులు కట్టిన కూడా తీరకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో భర్త, తల్లి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటుండగా కూతుళ్లు కాపాడబోయి వాళ్లు కూడా మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.










