
చాలారోజుల నుంచి తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించి, రోజువారీ పనులను సులభంగా నిర్వహించగల స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకో గుడ్ న్యూస్! తాజాగా పోకో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని భారత టెక్ మార్కెట్లో పోకో C81, పోకో C81X పేరిట విడుదల చేసింది. పోకో C81లో 6300mAh పెద్ద బ్యాటరీ ఉండగా, C81Xలో 5200mAh బ్యాటరీ ఉంది. అయితే, ఈ రెండు ఫోన్లు 15W ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్ల ధర, మొదటి సేల్, ఫీచర్లను వివరంగా చూద్దాం
పోకో C81 ధర, లభ్యత, ఫీచర్లు
పోకో C81 ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. అది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది.ఈ పరికరం ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్‌సెట్ గోల్డ్ రంగులలో లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే..పోకో C81 పరికరం 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. దీనివల్ల స్క్రీన్ చాలా సున్నితంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కాల్స్ చేయడం, వాట్సాప్ వీడియోలు చూడటం వంటి రోజువారీ ఉపయోగాలకు బాగుంటుంది. ఈ మొబైల్ 4GB RAM+ 64GB స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3 పై పనిచేస్తుంది. కంపెనీ నాలుగు సంవత్సరాల ఓఎస్ అప్డేట్లను అందిస్తుందని హామీ ఇస్తోంది. కెమెరా పరంగా, ఇందులో 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని అతిపెద్ద ప్రత్యేకత బిగ్ 6300mAh బ్యాటరీ. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
పోకో C81Xలో ధర, లభ్యత, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. 3GB + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999. ఈ పరికరం ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు ఉంటుంది. కాగా, ఇది సన్‌సెట్ గోల్డ్ రంగులో అందుబాటులో ఉంది.
ఫీచర్ల పరంగా, పోకో సి81ఎక్స్ ఈ సిరీస్‌లో కొంచెం చవకైన, మరింత బేసిక్ వెర్షన్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. ఇది యూనిసోక్ టి7250 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కొంచెం తక్కువ ర్యామ్ 3GB + 64GB స్టోరేజ్‌ను అందిస్తుంది. దీనిని మైక్రోఎస్డి కార్డ్ ద్వారా విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 13MP సింగిల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5200mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 15W ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.













