రాయ్‌పూర్: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఎంఐపై ఆర్‌సిబి రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 167 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ ముందు ఉంచింది. ఆర్‌సిబి 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయం సాధించింది. చివరలో కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులు చేసి విజయం కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కృనాల్ పాండ్య మీడియాతో మాట్లాడారు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తొడ కండరాలు పట్టుకున్నాయని, పిక్కల నుంచి వీపు వరకు కండరాల నొప్పులు ఉన్నా కూడా బ్యాటింగ్ చేశానని వివరించారు.

భువనేశ్వర్ చివరలో బంతిని సిక్స్ కొట్టిన బాల్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిందని ప్రశంసించారు. సంప్రదాయ క్రికెట్ షాట్లు ఆడాల్సిన ఈ పిచ్‌పై పూర్తి ఏకగ్రాత, ఎంతో ఓర్పుతో ఆడాల్సి వచ్చిందన్నారు. తనకు కఠిన పరిస్థితులంటే చాలా ఇష్టం అని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పాడు. ముంబయి ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు తాను, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ జట్టుకు వెన్నెముకలా ఉండేవాడని, టి20 ఫార్మట్‌లో కీరన్ పొలార్డ్ అత్యుత్తమ(గోట్) ఆటగాడని, అతడు మాత్రం తనకు పెద్ద అన్నయ్య లాంటి వాడని కృనాల్ తెలియజేశాడు. ముగ్గురు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ముంబయికి ఎన్నో విజయాలు అందించామని గుర్తు చేశారు. 2021లో ముగ్గురం కలిసి ఆడామని, అదే చివరి సారి అని చెప్పుకొచ్చారు.