
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతు లు గెలిచారని, రాజకీయ రాబందులు, పిట్టల దొర కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఈ తీర్పుపై కెటిఆర్ హర్షం వ్య క్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కు ట్రలు కూలిపోయాయని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్ప ష్టమైందని ఆయన అన్నారు.
ఇది జస్టిస్ పిసి ఘో ష్ కమిషన్ నివేదిక కాదని, పిసిసి (కాంగ్రెస్) నివేదిక అని తాము అప్పుడే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగడం వెనుక పెను కు ట్ర దాగి ఉందని, అది కచ్చితంగా కాంగ్రెస్ పనే అయి ఉంటుందని కెటిఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే వి శ్రాంత జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాం ధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను తాను మొదటి నుంచీ ‘పిసిసి రిపోర్ట్’ అని పిలుస్తున్నానని, నేడు కోర్టు తీర్పుతో అది నిజమని నిరూపితమైందని అన్నారు.
నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది
రేవంత్‌రెడ్డి ఎవరిని తెచ్చి ఏ విధంగా వాదించినా, చివరకు సత్యమే గెలిచిందని, నిప్పులాంటి నిజం బయటకు వచ్చిందని కెటిఆర్ పునరుద్ఘాటించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది బిఆర్ఎస్కు ఏటిఎంలా మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుకు అయిన మొ త్తం ఖర్చు రూ. 94 వేల కోట్లు అయితే, లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.కాళేశ్వరం విషయంలో ఆఘమేఘాల మీద స్పం దించిన ఎన్డిఎస్ఏ, ఎస్ఎల్బిసీ కూలినప్పుడు, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయినప్పుడు ఎక్కడకు పోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
కెసిఆర్ మీ ద ఉన్న వ్యక్తిగత కక్షతో రైతులను ఇబ్బంది పెట్ట డం సరికాదని ఆయన హితవు పలికారు. 2014 ముందు కెసిఆర్ పాలన ముగిసే నాటికి పెరిగిన పంట దిగుబడే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి నిదర్శనమని కెటిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ నేలపై గోదావరి జలాలు పారినన్ని రో జులు కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని, ఇవాళ రా ష్ట్రంలో పారుతున్న ప్రతి నీటి బొట్టుకు కారణం కెసిఆర్అని కెటిఆర్ కొనియాడారు. మేడిగడ్డ బ్యా రేజీపై పెట్టిన ఖర్చు కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ అంటే కుంగిన గడ్డ కాదని, అది తెలంగాణకు ’మే టి గడ్డ’, ‘నీటి గడ్డ’ అని ఆయన అభివర్ణించారు.
ఆర్టీసి కార్మికులకు బిఆర్ఎస్ మద్దతు
ఆర్టీసి కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు. ఎన్నికల ముందు ఆర్టీసి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నారని, తక్షణమే ఆర్టీసి కార్మికులకు కాం గ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.














