
ముంబై: 2026 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి)తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరంకానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలె తన సతీమణి దేవిషా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రసవ సమయంలో తన సతీమణి పక్కన ఉండేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో ఆర్సిబితో మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ రాయ్‌పూర్ వెళ్లగా.. సూర్యమాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. కానీ, ఈ మ్యాచ్‌లకు సూర్య అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. మ్యాచ్ రోజే జట్టుతో చేరుతాడని తెలిపింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో దూరం కాగా.. సూర్య జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఆర్సిబితో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడే విషయంపై క్లారిటీ లేదు. హార్దిక్ పాండ్యా ఆడకపోతే మళ్లీ సూర్యనే జట్టును నడిపించనున్నాడు.















