హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ సారి దశావతారం కాన్సెప్ట్‌తో ఈ షో పలకరించనుంది. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో బిగ్‌బాస్ హోస్ట్, కింగ్ నాగార్జున వివిధ గెటప్‌లలో కనిపించారు. ‘మీరు ఎంతైనా ఊహించుకోండి.. దాన్ని మించి ఈ సీజన్‌ ఉంటుంది. ఈ సారి ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’’ అంటూ వీడియోని పంచుకున్నారు. సర్‌ప్రైజ్‌లు, డ్రామా, సవాళ్లు అన్నీ 10 రెట్లు ఉంటాయని తెలిపారు. స్టార్ మా, హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈసారి సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.