
మహిళల ఆసియా కప్‌లో భారత్ విమెన్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్ విమెన్స్‌ను చిత్తుచేసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. కేవలం 55 పరుగులకే పాకిస్థాన్ జట్టు ఆలౌట్ అయింది. ఇది పాక్ మహిళల జట్టుకు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యల్ప స్కోర్. భారత స్పిన్నర్లు శ్రీ చరణి, ప్రేమా రావత్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాలుగు ఓవర్లు విసిరిన శ్రీ చరణి కేవలం కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ప్రేమ్ రావత్ కూడా 3 వికెట్లతో చెలరేగిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ 8 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. హర్మన్ ప్రీత్ కౌర్(18), దీప్తి శర్మ(12) రాణించడంతో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.








