
తనపై చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎవరూ ఊహించని విధంగా తనకు ఎంగేజ్మెంట్’ అయిపోయిందంటూ ప్రకటించి నటి అషురెడ్డి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒకవైపు పెళ్లి పేరుతో మోసం చేశారనే కేసులో విచారణకు బ్రేకులు వేయడానికి కోర్టు నిరాకరిం చడం. ఈ వార్త బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే తాను పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ఎంగేజ్మెంట్ వార్తను కన్ఫర్మ్ చేయడం ఇప్పుడు ఇండ స్ట్రీ సర్కి ల్స్‌లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అసలు ఆమె ఎవరిని చేసుకోబోతోంది? ఇదంతా కేసుల నుంచి జనాల దృష్టి మళ్లించే వ్యూహమా? లేక ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈ ఎంగేజ్మెంట్ జరిగిందా? అంటూ నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అషు రెడ్డికి నిజంగానే నిశ్చితార్థం జరిగిందా.? లేక ఏదైనా మూవీ షూటింగ్‌లో స్టిల్స్ షేర్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.















