
హైదరాబాద్: హెచ్1బి వీసాల ముసుగులో భారతీయుఎలు అమెరికాల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని అమెరికాలోని మిస్సౌరి సెనేటరీ ఎరిక్ స్మిత్ విమర్శించారు. హెచ్ 1బి, ఎల్1, ఎఫ్-1 వంటి వీసా వ్యవస్థలతో అమెరికా స్థానిక వేతన వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలియజేశారు. తక్కు వేతనాలకే భారతీయులు అందుబాటులో ఉండడంతో అమెరికన్లను కాదని ఇండియన్స్‌కే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. రోజు రోజుకు ప్రతిభ కంటే జాతిపక్షపాతం పెరిగిపోతుందని స్మిత్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ దేవాలయం వీసాల మాఫీయాకు అడ్డగా మారిందని ఆరోపణలు చేశారు. చిలుకూరి బాలాజీ దేవాలయం అనేది వీసా కార్టెల్‌కు ప్రధాన కేంద్రం అని ఫొటోను షేర్ చేయడంతో పాటు వీసాల దేవాలయంగా మారిందన్నారు. హైదరాబాదీలను లక్ష్యంగా చేసుకొని ఆయన ట్వీట్ చేశారు. అమెరికా వీసాల కోసం ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.












