టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులు, టీ-20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడి.. అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలుకుతాడని అంచనాలు ఉన్నాయి. అయితే కోహ్లీ టెస్టుల్లో పునరాగమనం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఓ ఈవెంట్‌లో విరాట్‌కి ఈ విషయంపై ఓ ప్రశ్న ఎదురైంది. దానికి చాలా తెలివిగా సమాధానం చెప్పాడు కోహ్లీ.

స్పోర్ట్స్ బ్రాండ్ వన్8 లాంచ్ ఈవెంట్‌కు కోహ్లీ హాజరయయాడు. అక్కడ ఓ షూ ధర రూ.9,230గా ఉంది. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో సాధించిన పరుగుల సంఖ్య అదే. దీంతో కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమెడియన్ డానిష్ సైత్ దీన్న కో్ట్ చేస్తూ ఓ ప్రశ్నను సంధించాడు. ‘‘మీరు ఇంకొన్ని పరుగులు చేసి. ఆ వస్తువు విలువ పెంచొచ్చు కదా?’’ అని డానిష ప్రశ్నంచగా.. ‘‘నేను తక్కువ ధరకే అమ్మాలని ప్రయత్నిస్తాను. మీరు చెబుతున్న దానితో నా పని అయిపోయింది. ధన్యవాదాలు’’ అని విరాట్ స్పష్టం చేశాడఐ.