
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ (జీఎస్ హెచ్) హాస్టల్‌లో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఉదయం టిఫిన్‌గా బజ్జీలు తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, విరేచనాల లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు హాస్టల్‌లోనే విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొందరు విద్యార్థులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.








