
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం తెల్లవారు జామునుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది.
ఇక, తిరుమల వెంకన్నను 73,324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 22,955 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.














